రవితేజ నటించిన క్రాక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సంక్రాంతి కి రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పటికీ వసూళ్ల సునామీని చూపిస్తుంది.. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది క్రాక్ సినిమా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా లో శృతి హాసన్ కథానాయికగా నటించగా శృతి కి కూడా ఈ సినిమా హిట్ ఎంతో దోహదపడింది.. ఈ సినిమా తర్వాతనే ఆమెకు కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయి. క్రాక్ సినిమా హిట్ తో ఇండస్ట్రీ కి జోష్ వచ్చినట్లయింది..