తెలుగు బుల్లితెర పై వస్తున్న జబర్దస్త్ ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఎప్పుడైతే జబర్దస్త్ కామెడీ షో మొదలైందో తెలుగులో కమెడియన్ లకు కొదువ లేదు అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది.. జబర్దస్ కంటే ముందు వచ్చిన ఏ షో కూడా ఈ రేంజ్ లో రేటింగ్ వచ్చిన దాఖలాలు లేవు.. తర్వాత కూడా వస్తుందన్న నమ్మకం లేదు.. వచ్చిన ఇన్ని రోజులు ఎడతెరపి లేకుండా నడుస్తోందన్న గ్యారెంటీ లేదు.. ప్రపంచ టీవీ ఇండస్ట్రీ ని కుదిపేసిన షో ఈ జబర్దస్త్..