
ఇన్నేళ్లలో కూడా అవే స్టెప్పులు ఏమీ మారలేదని సుమ చెప్పగా.. కృష్ణంరాజు నువ్వు యాంకరింగ్లో ఏమైనా మార్చావా అంటూ పంచ్ వేశారు. అతని వేసిన పంచులకు సుమా తల దించుకోవడం జరిగింది. సుమ క్యాష్ షో అనేది ఒక ఫ్యామిలీ షో అని చెప్పగా.. ఫ్యామిలీస్ ను ఎందుకు పిలవలేదు అంటే జోగి బ్రదర్ పంచులు వేయడం జరిగింది. జోగినాయుడు సుమ నీకు తెలుసు కదా అని అడగగా కృష్ణంరాజు నేను చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి నే చూస్తూ ఉండేవాడిని అని మరో పంచ్ వేశారు.
సుమ నిద్రపోకుండా రాత్రంతా పంచులు ప్రాక్టీస్ చేసి ఉదయాన్నే ఆ పంచులు వేస్తోంది అంటూ ఆమె పరువు తీసేశారు. దీంతో జోగి నాయుడు ఆమె దగ్గర మనం పంచులు నేర్చుకుందామా అని అడగగా.. మనం ఆమె దగ్గర ఏమి నేర్చుకోలేదు మనకు మలయాళం అర్థం కాదని కృష్ణంరాజు పంచ్ వేశారు. ఆ తరువాత క్యాష్ షో కు సమీర్ కాంట్రాక్టర్ అని సుమ ఇంకా డబ్బులు ఇవ్వడం లేదని ఎన్నిసార్లు క్యాష్ లోకి వస్తున్నాడు అంటూ కృష్ణంరాజు పై పంచ్ వేయడం జరిగింది. ఈనెల 4వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నది. ఈ ప్రోమో అద్భుతంగా ఉన్నది.