తెలుగులో గత అయిదు సీజన్ లుగా సక్సెస్ఫుల్ గా ప్రసారం అయిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో బుల్లితెరపై మా టీవీ అనే ఛానెల్ లో ప్రసారం అవుతుంది. ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సారి కొత్త కొత్త ఆక్టివిటీస్ మరియు కాన్సెప్ట్ లతో మన ముందుకు రావడానికి బిగ్ బాస్ టీం సిద్ధంగా ఉంది. అయితే ఈ సారి ఎప్పుడూ మొదలు కావాల్సిన బిగ్ బాస్ సీజన్ 6 రియాలిటీ షో ... వాయిదా పడుతూ పడుతూ మొత్తానికి ఒక డేట్ కు ఫిక్స్ అయింది. అధికారిక సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4వ తేదీన టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ అయింది.

కానీ లిస్ట్ లో ఉంది వీరే అని ఒక పక్కా సమాచారం అయితే లేదు. కానీ వాస్తవంగా కంటెస్టెంట్ లు ఎవరు అనేది తెలియాలంటే షో స్టార్ట్ అయ్యే రోజు వరకు ఎదురుచూడాల్సిందే. కాగా ఇప్పుడు ఈ షో కు సంబంధించిన మరొక విషయం చర్చకు దారి తీస్తోంది. ఈ షో కు కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. అయితే హోస్ట్ గా చేయడానికి నాగార్జున ఈసారి తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశారు అని తెలుస్తోంది. గత సీజన్ కు నాగార్జున 12 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకోగా, ఈ సీజన్ కు మాత్రం ఏకంగా మూడు కోట్లు పెంచి 15 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

కాగా ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ మీద టాలీవుడ్ అంతటా పెద్ద చర్చ అవుతోంది. వారంలో రెండు రోజుల పాటు హోస్ట్ చేయడానికి అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇదే నిజమైన రెమ్యూనరేషన్ ఆ లేదా కేవలం గాసిప్ అన్న వాస్తవం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: