
ఇకపోతే అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్లో ఉన్నప్పుడే భరద్వాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడి.. తొమ్మిదేళ్ళపాటు ఆ ప్రేమను కొనసాగించి ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా ఇద్దరు పట్టుపట్టి మరీ ఒప్పించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కొడుకులు జన్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే 9 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య కుల ప్రస్తావన ఎప్పుడు రాలేదట.
లగ్నపత్రిక రాసే ముందు వరకు భరద్వాజ్ కులం ఏంటో అనసూయకు తెలియదట. అయితే తాజాగా పెద్దకాపు - 1 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ ఈ విషయాన్ని వెల్లడించింది. అనసూయ మాట్లాడుతూ.. కుల మతాలను నేనెప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తొమ్మిదేళ్లు నేను ప్రేమలో ఉన్నప్పటికీ కూడా భరద్వాజ్ కులం ఏంటో నాకు తెలియదు.లగ్నపత్రిక రాసేముందు ఆయన గోత్రం, కులం అడిగారు అప్పుడే ఆయన ఫలానా కులానికి చెందిన వ్యక్తి అని తెలిసింది .ఇక మేము ఇద్దరం కూడా కులమతాలను పట్టించుకోము అంటూ అనసూయ మీడియా సందర్భంగా వెల్లడించింది.