సాధారణంగా ఎవరైనా హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే ఖచ్చితంగా నటించడానికి మక్కువ చూపుతూ ఉంటారు బుల్లితెర నటిమనులు.. అలాంటిది తాజాగా ఒక నటి మాత్రం బాలయ్య సినిమాలో అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశానని తెలియజేస్తోంది.. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి ఆశ్రిత వేముగంటి.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలలో నటిస్తానంటే తన కుటుంబ సభ్యులకు నచ్చలేదని తెలిపింది. దీంతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదివానని తెలియజేసింది.. తను ఎలాంటి పని చేసిన కాస్త సీరియస్ గానే చేస్తానని ఆశ్రిత వెల్లడించింది..వివాహం చేసుకొని సినిమాలు చేయాలని అమ్మ తనకు సూచనలు తెలియజేసిందని తమది పెద్దలు కుదిరిచిన వివాహం అంటూ తెలియజేసింది ఆశ్రిత.. తన భర్త వయసులో పెద్ద అయినప్పటికీ చూడడానికి తనకంటే చిన్నగానే కనిపిస్తారని తెలిపింది.తను బరువు పెరగడం గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలను తెలిపింది. తాను  ఎప్పుడూ కూడా సన్నగా లేనని కరోనా తర్వాత యోగా చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నానంటూ తెలిపింది ఆశ్రిత.. తన భర్త కూడా హెల్త్ కేర్ లో పనిచేస్తున్నారని కరోనా సమయంలో నర్సులు డాక్టర్లు తనకు దేవుళ్ళ కనిపించారంటూ తెలిపింది..


సినిమాలకు సంబంధించి రెమ్యూనరేషన్ ని తానే ఫైనల్ చేస్తానని మెయిల్ యాక్టర్స్ కు ఫిమేల్ యాక్టర్స్ కు రెమ్యూనరేషన్ విషయంలో చాలా తేడా ఉంటుందని ఆశ్రిత వెల్లడించింది ప్రకాష్ రాజ్ గారు ఒక్కో సినిమాలో ఒక్కోలో నటిస్తారని బాహుబలి ముందు వరకు ఒకే ఒక్క సీరియల్స్ లో నటించానని తెలిపింది ఆశ్రిత. సీరియల్స్ అనేది వేరే ప్రపంచమని తెలిపింది.. ఇటీవల బాలయ్య బాబి కాంబినేషన్లో తనకి మూవీ ఆఫర్ వచ్చిందని పది రోజులు అవుట్డోర్ షూటింగ్ అని చెప్పడంతో ఆ పాత్రకు ఒప్పుకోలేదని తెలియజేసింది ఆశ్రిత.. అలా అందుకే బాలయ్య సినిమాలో నటించే అవకాశాన్ని సైతం ఈమె వదులుకున్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: