తెలుగు యాంకర్ గా ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన యాంకర్ రష్మి గురించి చెప్పాల్సిన పనిలేదు.. సుడిగాలి సుదీర్, యాంకర్ రష్మీ జంటకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారిన రష్మీ ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే ఈమె హీరోయిన్గా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తిరిగి మళ్ళీ యాంకర్ గానే తన కెరీర్ ని మలుచుకుంది. అయితే అవకాశాలు వచ్చినప్పుడల్లా తనని తాను నిరూపించుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. బోల్డ్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది రష్మీ.



చివరిగా 2022లో బొమ్మ బ్లాక్ బాస్టర్ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ సినిమా పర్వాలేదు అనిపించికున్న ఎందుకో హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాలలో గెస్ట్ అపీరియన్స్ పాత్రలలో నటించింది. అయితే ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత రష్మి మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈసారి హీరోయిన్ గా కాకుండా తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి పోస్టర్ చూసి కూడా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


డైరెక్టర్ అఖిల్ బాబు డైరెక్షన్ల ప్రదీప్ పళ్లి, యాంకర్ రష్మీ కీలకమైన పాత్రలో నటిస్తున్న చిత్రం వై తరణి. అందుకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతున్నాయి. అయితే వీరు చుట్టూ శవాలు ఉన్నట్లుగా ఈ పోస్టర్లో అయితే కనిపిస్తోంది. ఇందులో రష్మి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో తనని తాను నిరూపించుకొని రాబోయే రోజుల్లో అవకాశాలు సంపాదించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి కొంతమంది పాత్ర నచ్చితే రష్మీ ఎలాంటి పాత్రనైనా  చేయడానికి సిద్ధమే అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ను యాంకర్ రష్మి అభిమానుల కోసం తెలియజేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: