సాధార‌ణంగా మార్కెట్‌లోకి ఏ ఫోన్ వ‌స్తుందా అని స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే మీరు కొత్త ఫోన్ కొన్న‌ప్పుడు ఈ ముఖ్య‌మైన ప‌నులు చేయ‌డం మాత్రం మార్చిపోవ‌ద్దు.  వీటి ద్వారానే మీకు మీ కొత్త ఫోన్ చాలా సులభంగా అలవాటు అవుతుంది. అందులోనూ ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే వీటిని కచ్చితంగా మార్చాల్సిందే.. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ లోనే ఎన్నో ఫీచర్లు, తెలియని సెట్టింగ్స్ ఉంటాయి. సాధార‌ణంగా కొత్త ఫోన్ కొనగానే అందరూ ముందుగా చేసే పని గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి తమకు అవసరమైన యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం. కానీ ఇలా  డౌన్ లోడ్ చేసుకోగానే వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ అన్నీ హోం స్క్రీన్ మీద నిండిపోతాయి. 

 

దీంతో ఫోన్ డిస్ ప్లే కూడా చూడటానికి అంత బాగా కనిపించదు. అలా కనిపించకుండా చేయడానికి కూడా ఒక దారి ఉంది. మీ స్మార్ట్ ఫోన్ హోం స్క్రీన్ మీద ఖాళీగా ఉన్న చోట లాంగ్ ప్రెస్ చేయండి. వెంటనే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో హోం సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. అందులో యాడ్ ఐకాన్ టు హోమ్ స్క్రీన్‌ అనే ఆప్షన్ ఉంటుంది. అది డీఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటుంది. మీరు దాన్ని డిసేబుల్ చేశారంటే ఇంక మీరు డౌన్ లోడ్ చేసే యాప్స్ కు సంబంధించిన షార్ట్ కట్స్ ఏవీ హోం స్క్రీన్ మీద కనిపించవు. ఇక స్మార్ట్ ఫోన్ కి బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం.  

 

మీ స్మార్ట్ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్ ను మెరుగు పరచవచ్చు. ఆటో బ్రైట్ నెస్ ఆప్షన్ ను డిసేబుల్ చేసి బ్రైట్ నెస్ ను 50 శాతం లోపే ఉంచాలి. మీ ఫోన్ స్క్రీన్ ఎంత ప్రకాశవంతంగా వెలిగితే.. మీ ఫోన్ లో అంత చార్జింగ్ అయిపోతుంది. సో.. బ్యాటరీ అడాప్టివ్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లను ఉపయోగించండి. మీరు ఫోన్ పక్కన పెట్టేసి నిద్ర పోవాలనుకుంటారు. అలా నిద్రపోగానే ఫోన్ కాలో, వాట్సాప్ మెసెజో వస్తుంది. అంతే.. నిద్ర పోవాలన్న మూడూ, ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోతాయి. మీ ఫోన్ లో ఈ డూ నాట్ డిస్ట‌బ్‌ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకుంటే.. మీరు సెట్ చేసుకున్న టైమ్ లో మీ ఫోన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: