
ఈ సీ-295 ఎం.డబ్ల్యూ విమానంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని బాహుబలి విమానం అని పిలుస్తున్నా కూడా ఈ విమానం ల్యాండ్ అవ్వడానికి, టేకాఫ్ కావడానికి పెద్ద రన్‌వే అవసరం లేదని తెలుస్తుంది. మామూలు విమానాలు ల్యాండ్ అవ్వడానికి ఇబ్బంది పడే ప్రదేశాల్లో కూడా ఈ విమానం జాగ్రత్తగా ల్యాండ్ అవుతుందని తెలుస్తుంది అంటే కరుకైన, చదునుగా లేని పర్వత ప్రాంతాల్లో కూడా ఈ విమానం సులభంగా ల్యాండ్ అవుతుంది.
అత్యవసర సమయాల్లో ఈ విమానాలు సైన్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సైనికులు ఒక్కసారే ఎక్కువ మొత్తంలో యుద్ధ సామాగ్రిని సరిహద్దుల్లోకి తరలించడానికి ఈ విమానం ఎంతగానో ఉపయోగపడుతుంది. సుమారుగా 7050 కిలోల బరువు వరకు ఈ విమానం రవాణా చేయగలుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది సైన్యాన్ని, అలాగే ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని కూడా రవాణా చేయగలదు. ఇది ఎక్కువ బరువును మోయగలగడం మాత్రమే కాకుండా ఎక్కువ గంటల పాటు అంటే సుమారు 11 గంటల పాటు నిరంతరంగా ప్రయాణం చేస్తుంది.
రెండో సీ-295 విమానాన్ని మే 2024 లో భారత్‌కు తీసుకొస్తారు. స్పెయిన్ నుంచి 56 విమానాలను తయారు చేయించి కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉంది కేంద్రం. సీ- 295 2030 - 31 కాలం నాటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏజియింగ్ ఏవ్రో 748 విమానాలను క్రమంగా భర్తీ చేస్తుంది అని అంటున్నారు.