ప్రాణాల మీదికి వచ్చినప్పుడు పిల్లి కూడా పులిలా మారిపోతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు.  అయితే ఇది కేవలం పిల్లి విషయంలోనే కాదు ప్రతి ఒక్క జీవి విషయంలో కూడా నిజం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రాణాల మీదికి వచ్చిన సమయంలో ఏకంగా తనకంటే బలవంతమైన జంతువును సైతం ఎదిరించడానికి మిగతా జీవులు సిద్ధపడుతూ ఉంటాయి. మనుషులు కూడా అప్పటివరకు భయపడిన వారు ప్రాణాల మీదికి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు అని చెప్పాలి.


 ఇలా ప్రాణాల మీదికి వచ్చేంతవరకు కూడా తన బలమేంటో తనకే తెలియదు అన్న విధంగానే ఈ భూమి మీద ఎన్నో జీవులు ఉంటాయి అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన మారిపోయిన వీడియో అందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా గ్రామ సింహంగా పేరు ఉన్న ఒక వీధి కుక్క ప్రమాదకరమైన చిరుత పులిని భయపెట్టేసింది. దాడి చేయడానికి వచ్చిన చిరుత పులి తోక ముడిచి చివరికి దాని దారిలో అది వెళ్లిపోయింది.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను  ఆకర్షిస్తూ ఉంది అని చెప్పాలి. జైకి యాదవ్ అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా రోడ్డుపై నిద్రిస్తున్న కుక్కపై దాడి చేయడానికి చిరుత పులి దూసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన కుక్క దాన్ని చూసి ఏకంగా మొరగడం ప్రారంభించింది. దీంతో ఇక కుక్క ధైర్యానికి భయపడిపోయిన చిరుత పులి తోక ముడిచింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూస్తుంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడడం కాదు ధైర్యంగా ఎదిరించి నిలబడాలి అనే ఒక మెసేజ్ అందరికీ చేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: