జీవితమే ఒక ఆట.. సాహసమే పూబాట అనే పాట ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. అయితే నిజంగానే జీవితం ఒక ఆటే. ఆ ఆటలో మనం ఎలా ఆడుతున్నామని దాన్నిబట్టే మన జీవితం కూడా సాగిపోతూ ఉంటుంది. ఎంతోమంది ఇలా తమ జీవితాన్ని మార్చడానికి దేవుడు దిగి రావాల్సిన పనిలేదు. తమ జీవితాన్ని మార్చుకునే సత్తా తమ చేతుల్లోనే ఉంది అని నమ్ముతూ ఏదో ఒకటి వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఎక్కువగా హార్ట్ వర్క్ ని నమ్ముకునే వాళ్ళు. కానీ ఇప్పుడు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ గొప్పది అని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ వర్క్ చేయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఇలా స్మార్ట్ వర్క్ చేసి ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ ఒక బాలుడు మామిడి పండ్లు అమ్మడం కోసం చేసిన పని కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా హైవే పక్కన మామిడిపండ్ల బండిని పెట్టుకుని అమ్మడం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. కానీ ఇలా వెరైటీగా అమ్మడం మాత్రం మొదటిసారి చూసి ఉంటారు. ఏకంగా రోడ్డు వెంట వెళ్తున్న కస్టమర్ల దృష్టి తన మామిడి పండ్లు బండిపై పడేందుకు ఇక కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు బాలుడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే హైవే సైడ్ లో పసుపు రంగు టీషర్ట్ జీన్స్ వేసుకున్న ఒక కుర్రాడు డాన్స్ చేయడం మనం ముందుగా చూడొచ్చు. అయితే బాలుడి డాన్స్ స్టెప్స్ అక్కడి నుంచి వచ్చి పోయే వాహనదారులను ఆపమని ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో వాహనాలు ఆగకుండానే వెళ్ళిపోతున్నాయి. కానీ కారు ఆగినప్పుడు ఆ పిల్లాడి ముఖంలో చిరునవ్వు వికసిస్తుంది. దేవుడి దయవల్ల నాకు గిరాకీ దొరికిందని.. ఆ పిల్లాడు ఎంతో సంతోష పడిపోయాడు అని చెప్పాలి. ఇలా రోడ్డు వెంట వెళ్తున్న కస్టమర్ల దృష్టిని తన మామిడి పండ్ల బండి వైపు మల్లెందుకు.. ఆ బాలుడు చేసిన ప్రయత్నం మాత్రం అందరిని ఫిదా చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: