వేసవికాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఇక దాహార్తిని తీర్చుకునేందుకు.. ఎంతో మంది కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం వేసవిలో మాత్రమే కాదు ప్రతి కాలంలో కూడా కొబ్బరి నీరు తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి బొండాలను వేసవిలో ఎక్కువగా తాగడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు జనాలు. ఇక దాహం వేసిన సమయంలో కొబ్బరి బోండా ఇచ్చే ఉపశమనం మరేది ఇవ్వలేదు అనడంలోనూ సందేహం లేదు.



 ఇలా దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే.. కొబ్బరి బోండాలు తాగి ఇక ఆరోగ్యానికి మేలు చేసుకోవడం మంచిది అని ఎంతోమంది భావిస్తూ ఉంటారు.  కానీ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ఇక మీ ఒపీనియన్ తప్పకుండా మార్చుకుంటారు. మరోసారి కొబ్బరి బోండాలు తాగాలంటేనే భయపడిపోతారు అని చెప్పాలి. చివరికి కొబ్బరి బొండాలను కూడా మనుషులు కలుషితం చేస్తున్నారు అన్న విషయం ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది.



 ఇక్కడ ఒక వ్యక్తి అందరిలాగానే కొబ్బరిబోండాలను అమ్మడం చేస్తూ ఉన్నాడు. అయితే బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై ఏకంగా పక్కనే ఉన్న డ్రైనేజీ లోనుంచి నీళ్లు తెచ్చి చల్లుతూ ఉండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అతను ఇలా డ్రైనేజీ నీళ్లు చల్లడం చూసిన ఒక వ్యక్తి షాకై వెంటనే ఈ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ గా మారిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సదర్ వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని బారేలికీ చెందిన 28 ఏళ్ల సమీర్ గా గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: