ఇక రాక్‌స్టార్స్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది అందరికి తెలిసిందే.మైఖేల్ జాక్సన్ నుంచి జస్టిన్ బీబర్ వరకు తమ పాటలతో అదరగొట్టి బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక వారిని ఆదర్శంగా తీసుకొని కొందరు రాక్ స్టార్స్ నిర్వహించే లైవ్ కన్సర్ట్‌లకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇక వారిని ఎక్కడా నిరుత్సాహపరచకుండా రాక్ స్టార్స్ ఉత్సాహంగా పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తారు. ఈ సందర్భంగా సంగీతంలో గాయకులు ఎంతగా లీనమవుతారో తెలియాలంటే ఇక తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఈ రాక్ స్టార్ తనకు మంటలు అంటుకున్నా సరే.. ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. తన పాటను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక స్టేజ్ మీద ఉన్న పైపుల నుంచి ఒక్కసారే మంటలు పైకి లేచాయి.ఇక అది షోలో భాగమే కాబట్టి.. ఆ రాక్‌స్టార్ పెద్దగా దానికి భయపడలేదు.

ఇక అయితే, ఆ మంటలు ఏకంగా అతడి జుట్టును తాకాయి. ఇక తన పాటలో నిమగ్నమైన అతడికి ఈ విషయం అసలు తెలియలేదు. ఇక దీంతో తన పాట కొనసాగించాడు. ఇక అతడి పక్కనే ఉన్న మరో మ్యూజీషియన్ కూడా ఆ ప్రమాదాన్ని గుర్తించి జుట్టు మీద ఉన్న మంటలను ఆపేశాడు.ఇక అవి పూర్తిగా ఆరకపోవడంతో ఈ సారి ఆ మంటలు ఒక్కసారిగా పెద్దవయ్యాయి.ఇక దీంతో అక్కడున్న మిగతా సిబ్బంది వచ్చి ఆ మంటలు ఆర్పారు.ఇక ఇంత జరుగుతున్నా కాని .. ఆ రాక్‌స్టార్ తన పాటను కొనసాగిస్తూనే ఉన్నాడు.ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. తన వెనకాల అంతలా మంటలు అంటుకుంటే..నిజంగా అతడు అంత కూల్‌గా తన పాటను కొనసాగించడం చాలా గ్రేట్ అంటున్నారు నెటిజన్స్..నిజంగా అతని డెడికేషన్ కి హ్యాట్సఫ్ చెప్పాల్సిందే. తనకు ఇష్టమైన పనిలో నిమగ్నమయ్యి తనకు ప్రమాదం జరిగినా కాని తన డెడికేషన్ చూపించాడు.



https://youtu.be/BrsCg6KtjM8

మరింత సమాచారం తెలుసుకోండి: