
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరి లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉన్న హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు ఎప్పటి కప్పుడు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఏకంగా రచ్చరచ్చ చేస్తూ జనాలను సైతం ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు జరిగింది. ఇక ఈ పుట్టిన రోజున అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేయడం లాంటివి కూడా చేశారు. కొంతమంది పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇక పలు సేవ కార్యక్రమాలు సైతం చేశారు.
కానీ ఇక్కడ ఒక అభిమాని మాత్రం ఏకంగా రోడ్డుమీద రచ్చ రచ్చ చేశాడు. రోడ్డు మీద అటూ ఇటూ వాహనాలు తిరుగుతున్నాయి. ఆ సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ పట్టుకున్నాడు. ఆ ఫ్లెక్సీ పైన హ్యాపీ బర్త్ డే అన్నయ్య అని రాసి ఉంది. ఇక ఆ ఫ్లెక్సీని చేతిలో పట్టుకుని అటూ ఇటూ ఎగురుతు రచ్చ చేశాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫోటో ని రోడ్డు మీద వేసీ పవన్ ఫోటో పై అటు ఇటు దొర్లాడు. అయితే సదరు యువకుడు తీరుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోలేదు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో పవన్ ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.