సాధారణంగా తల్లి తన పిల్లలను ఎప్పుడు రక్షించుకుంటూ ఉంటుంది అన్నది అందరికి తెలిసిన విషయమే. కడుపులో ఉన్నప్పుడు మాత్రమే కాదు జన్మనిచ్చిన తర్వాత కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ఇక తమ పిల్లలకు ఏదైనా కష్టం వచ్చింది అని తెలిస్తే  అపర ఖాళీ అవతారమెత్తి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే  తల్లిని మించిన దైవం ఇంకెక్కడా లేదు అని చెబుతూ ఉంటారు ఎంతో మంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే అని చెప్పాలి. అయితే కేవలం మనుషుల్లో మాత్రమే కాదు అటు జంతువుల్లో కూడా ఇలాంటి మాతృత్వ ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. క్రూర మృగాల దగ్గరనుంచి సాధు జంతువు ల వరకు కూడా తల్లి తన పిల్లల దగ్గరికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే ఎలాగైనా రక్షించుకోవాలని  ప్రాణాలను పణంగా పెడుతూ ఉంటుంది.


 ఇలా ఇప్పటివరకు తల్లి ప్రేమకు నిదర్శనం గా మారి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం తల్లి పిల్లలను రక్షించడమే కాదు పిల్లలు సైతం తల్లికి ఏదైనా అపాయం ఉందని తెలిస్తే ప్రాణాలకు తెగించి మరీ రక్షిస్తారు అన్న దానికి నిదర్శనంగా ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.  ఇక తల్లికి అపాయం తల పెట్టడానికి వచ్చిన ఒక వ్యక్తికి బాగా  బుద్ధి చెప్పింది ఇక్కడ ఒక లేగదూడ. ఇక్కడ ఒక వ్యక్తి పెద్ద కర్ర పట్టుకుని ఆవుని కొట్టడానికి వెళ్ళాడు.


 అయితే తన తల్లిని ప్రమాదం నుంచి ఎలా రక్షించాలి అని పక్కనే ఉన్న లేగదూడ కాసేపు ఆలోచించింది. ఇక ఆ తర్వాత ఆ లేగదూడ ఏకంగా వెనక రెండు కాళ్ళతో ఒక్కసారిగా ఎగిరితన్నింది. దీంతో ఆవుని కొట్టడానికి వెళ్లిన వ్యక్తి గాల్లో ఎగిరి దూరంగా పడ్డాడు. ఇక అతను పేడలో పడటంతో అతని బట్టలు మొత్తం పేడ అంటుకుంది. అయినప్పటికీ పైకి లేస్తూ చివరికి చేసిన తప్పు తెలుసుకుని పక్కకు వెళ్ళిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. ఇది చూస్తే లేగదూడ బలే బుద్ధి చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: