ఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అదే సమయంలో ఈ భూమ్మీద నూకలు చెల్లి పోయాయి  అంటే చాలు ఊహించని రీతిలో మృత్యువు దరిచేరుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఊహించని ప్రమాదాలు కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు.  అయితే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేరు. ఇటీవల కాలంలో ఎన్నో రకాల రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


  ఒకరూ రోడ్డు నిబంధనలు పాటించినప్పటికి మరొకరు పాటించకపోవడం కారణంగా చివరికి ఇద్దరు ప్రమాదం బారిన పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి.  అయితే సాధారణంగా వాహనాలపై వెళుతూ ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. కానీ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి చివరికి ప్రాణాలు గాల్లో కలిసి పోతుంటాయి. ఇక ఇలాంటివి చూసినపుడు భూమ్మీద నూకలు తినే భాగ్యం లేనప్పుడు ఎవరూ కాపాడలేరు అని మాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలుసుకున్న తర్వాత రోడ్డుపై నడిచేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు.


 ఇటీవలే ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.  ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఒక మహిళా రోడ్డు పక్కన హాయిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఇక వెనుక నుంచి ఒక ట్రక్కు వచ్చింది . అయితే ఆ ట్రక్కు ఆమె పక్క నుంచి వెళ్ళిపోయింది. కానీ పొరపాటున ఆ ట్రక్కు వెనకాల ఉన్న డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఇక ఆటో డోర్ ఆ మహిళకు  బలంగా తగిలింది. దీంతో ఆమె ముందు ఉన్న కార్ కు ఆమె బలంగా ఢీ కొట్టుకొని కిందపడిపోయింది.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: