తెలంగాణలో ఎన్నికల రాజకీయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రేంజ్ లో వార్ నడుస్తోందని చెప్పవచ్చు.. ఒకరి పైన మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. ప్రతి సవాళ్లతో కూడా రాజకీయం హీటెక్కిలా కనిపిస్తోంది. నేతలు తమ ప్రత్యర్థుని ఇరుగుపెట్టేందుకు సోషల్ మీడియాలో పలు రకాల టీవీ చానల్స్ లో కూడా యాడ్స్ ఇతరత్రా వంటివి చేసుకుంటూ పాపులారిటీ పెంచుకొనేలా చేస్తూ ఉన్నారు. BRS, కాంగ్రెస్, బిజెపి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వార్ జరుగుతోందని చెప్పవచ్చు.


తెలంగాణలో రేపటి రోజున ఎన్నికల పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు రేపు విద్యార్థులకు సైతం సెలవు దినాన్ని ప్రకటించడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో లేనివారికి టీచర్లను ఎలక్షన్ డ్యూటీకి వేసినట్లుగా తెలుస్తోంది. చాలామందికి వేతనంతో కూడిన సెలవుగా ఇచ్చినట్లు సమాచారం. పోలింగ్ జరిగే 30వ తేదీన అన్ని విద్యాసంస్థలకు పలు రకాల కార్యాలయాలకు సెలవులు ఇవ్వాలని ఈసీ సైతం ఆదేశాలు జారీ చేసింది రేపటి రోజున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగబోతున్నాయి. డిసెంబర్ మూడవ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రతిపక్ష నేతలు మాత్రం అధికార పార్టీలో ఉన్న కేసీఆర్ పైన పలు రకాల విమర్శలు చేయడంతో పాటు ట్విట్టర్ లో కూడా పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీవీ ప్రమోషన్స్ వాణిజ్య ప్రకటనలకు సైతం రేపటిలోగా పూర్తి చేయాలి.. ఎలక్షన్ కమిటీ ఇచ్చిన సమయం వరకూ మాత్రమే ఇలాంటివన్నీ ప్రచారం చేసుకోవాలి ఆ తర్వాత అన్నిటిని క్లోజ్ చేయవలసిందిగా తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు కూడా ఈ ఎలక్షన్స్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది మరి ఎవరు గెలుస్తారు అనే విషయం తెలియాలి అంటే డిసెంబర్ మూడవ తేదీ వరకు ఆగాల్సిందే. ఈసారి చాలామంది ఇండిపెండెంట్గా కూడా నిలుస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: