
ఈ ఏడాది రెండు తుఫాన్ దిశ మార్చుకోవడంతో మన రాష్ట్రం తో పాటు పలు రాష్ట్రాలలో కూడా లోటు వర్షపాతం ఉంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంత స్థాయిలో వర్షాలు పడడం లేదు..పసిఫిక్ సముద్రం మీదుగా వచ్చే గాలుల వల్ల తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం పడే అవకాశం ఉన్నదట. గతంలో తూర్పుగాలుల ప్రభావం రాష్ట్రం వరకు ఉండేది.... మంచి వర్షాలు ఉండేవి. ప్రస్తుతం ఆ గాలులు తమిళనాడు వరకే పరిమితమయ్యాయి. ఇటీవల కాలంలో తుఫాన్‌ల గమనాన్ని నిర్ధారించుకోలేకపోతున్నారు వాతావరణ శాఖ వారు. ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీల పెరుగుదల, కాలుష్యం అధికమవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందట.. మిచౌంగ్ తుఫాన్ దిశ మార్చుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వర్షాలు కురిసేందుకు అవకాశాల్లేవట .ఉత్తరకోస్తా ప్రాంతంలో తీరం దాటితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందంటున్నారు.
బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం వల్ల ఇది నిన్నటి రోజున వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదంటు అమరావతి వాతావరణ కేంద్రం తెలుపుతున్నది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపటి రోజుకి సైతం తుఫాన్‌గా మారే అవకాశం ఉంటుంది. ఇదే వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా మధ్యలో తీరానికి చేరే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు వస్తాయట. తుఫాన్ తీరం దాటడంపై ఈరోజు స్పష్టత వస్తుందట.. ప్రముఖ 'స్కైమెట్' అంచనా ప్రకారం తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కొనసాగుతోందని తుఫాన్‌గా మారేందుకు సముద్రం వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉన్నట్లు తెలుపుతున్నారు.