
సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు బయట వర్షం పడుతుండగా వేగంగా రైల్వే వెళ్తూ ఉంటే ఆ మజానే వేరు . ఒకవేళ దానికి భిన్నంగా పైప్ లైన్ లీకేజీ కారణంగా కూర్చున్న సీటుపై నుంచి వర్షపు నీళ్ళు మాదిరి మీద పడుతుంటే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఊహించుకోవడానికి సైతం అది ఛండాలంగా ఉంటుంది . ఇలాంటివి సాద సీదా ట్రైన్ లోనే జనరల్ గా జరుగుతూ ఉంటాయి . కానీ నరేంద్ర మోడీ ఎంతో కలలో కన్నా వందే భారత్ ట్రైన్ లోను ఇలాంటి సీన్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వారణాసి - ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ లో తనకు ఎదురైన ఈ తీవ్ర అసౌకర్యం పై ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేశారు .
"దర్శన్ మిశ్రా" అనే ప్రయాణికుడు ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ లో ఏసీ పనిచేయడం లేదని దాని కారణంగా ఓటర్ లీకేజీ అవుతుంది అని ఫైర్ అయ్యారు. ప్రీమియం చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు ఇలాంటివి చూసుకోరా ..?అంటూ మండిపడ్డారు . ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన తగిన రెస్పాన్స్ ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పై కప్పు నుంచి వాటర్ లీకేజీ అవుతూ వర్షాన్ని తలపించేలా ఉన్నా ఓ వీడియో ని ఏకంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ కి.. అలాగే రైల్వే శాఖకు ట్యాగ్ చేశాడు. అంతేకాదు డబ్బులు చెల్లించినా ప్రయాణం మొత్తం నిలబడే చేయాల్సి వచ్చింది అంటూ ఫైర్ అయ్యాడు .
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది . అయితే రైల్వే సిబ్బంది స్పందించారు . వందే భారత్ ఎక్స్ప్రెస్ లోని కోచ్ సి 7 రిటర్న్ ఎయిర్ డక్ట్ నుంచి వాటర్ లీకేజీ ఉందని గుర్తించి దాన్ని సవరించారు. అయితే తిరుగు ప్రయాణానికి న్యూఢిల్లీ స్టేషన్లో డీప్ ట్రైన్ క్లీన్ చేయడంతో పాటు ఫిల్టర్ మధ్య వాషర్ ని జోడించడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. దీని కారణంగా ఇబ్బందులు పడిన దర్శిల్ మిశ్రా కు కొంతమేర ఉపశమనం లభించింది. అయితే ఆయన కోరుకున్న విధంగా మాత్రం టికెట్ డబ్బులు రిఫండ్ చేయలేదు . అలా చేసి ఉంటే బాగుండేది అంటున్నారు నెటిజన్లు. ప్రీమియం ఛార్జీలు వసూళ్ళు చేసే ట్రైన్ లో ఇలాంటి సీన్లు షాకింగ్ కి గురి చేసే లా ఉన్నాయి అంటూ కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..!