
విజయవాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన బి వెంకట రామారావు 67 . ఆర్ అండ్ బి లో ఇంజనీరింగ్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు . ఆయన భార్య కొన్నేళ్ల క్రిందటే అనారోగ్య కారణంగా మరణించింది. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. రామారావు తన తల్లిని చూసుకోవడానికి ఇబ్బందిగా మారిపోయింది . అంతకు ముందు ఒక పనిమనిషి ఉండేది . ఆమె మానేయడంతో కొత్తగా అనుష అనే పని మనిషిని నియమించుకున్నారు . నియమించుకొని కూడా ఐదు రోజులు అవుతూ ఉండడం గమనార్హం.
ఒక బ్రోకర్ ద్వారా కేర్ టేకర్గా అనుష ని నియమించుకున్న వెంకట రామారావు మొదటి మూడు రోజులు బాగానే అనిపించింది . అందరితో చక్కగా కలిసిపోయి బాగా ఇంటి మనిషిలా నమ్మించింది. ఎప్పుడు కూడా అనూష సరస్వతి గదిలోనే పడుకునేది కానీ గురువారం రాత్రి మాత్రం హాల్లో పడుకుం. అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో సరస్వతికి మెలకువ వచ్చి చూడగా తన కుమారుడు గది తలుపులు తెరిచి ఉన్నాయి. లైట్లు వేసి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్ళగా మంచంపై కుమారుడు పడి ఉండడం చూసి తల్లడిల్లిపోయింది. ఎంత పిలిచినా లేవలేదు . దీంతో అనూష ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారిని పిలిచింది. వాళ్ళు వచ్చి రామారావు మృతి చెందినట్లు గుర్తించారు . అనూష నే డబ్బు ఆస్తి పత్రాలతో పారిపోయి ఉంటుంది అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు . దీనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అనూష ఫోన్ కాల్ ఆధారంగా ఆమెని నిందితురాలిగా పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు..!!