ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పింది . మనకు తెలిసిందే పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల చాలా బ్యాంకులు ఎత్తివేస్తూ వస్తున్నాయి . అయితే కొన్ని ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు మాత్రం అందుకు భిన్నంగా కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు . ఐసిఐసిఐ సేవింగ్ అకౌంట్ లో కనీస నిలువ అమౌంట్ ని పూర్తిగా పెంచేసింది యాజమాన్యం. మెట్రో , అర్బన్ , సెమీ అర్బన్ , గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులందరిపై ఈ పెంపు ప్రభావం ఉంటుంది అంటూ రీసెంట్ గానే ఐసిఐసిఐ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది.


ఈ నిబంధన ఆగస్టు ఒకటి నుంచి ఖాతా తెరిచే కస్టమర్లకు వర్తించబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చింది.  ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు ఈ రూల్ వర్తించదు. మారిన నిబంధనల ప్రకారం ఇకపై మెట్రో , అర్బన్ ప్రాంతాలలో ఎవరైతే ఐసిఐసిఐ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళ సగటు నిలవ కనీసం 50,000 ఉంచాలి అనే కండిషన్ పెట్టింది . గతంలో ఈ పరిమతి పదివేల వరకు ఉండేది.. ఇప్పుడు దాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచేసింది.  ఇలా చూసుకుంటే ఇక సెమి అర్బన్ కస్టమర్ల కనీస సగటు నిల్వ మొత్తం 5000 నుంచి 25 వేలకు ఉండాల్సిందే.



ఇక గ్రామీణ ఖాతాదారుల అకౌంట్లో 2500 నుంచి 10000 వరకు ఉండాల్సిందే . ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ నిలవని సరిచూసుకొని కొత్త నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలి అంటూ లేని పక్షంలో ఎక్స్ట్రా ఫైన్ చార్జెస్ కట్టాల్సి వస్తుంది అంటూ ఐసిఐసిఐ క్లారిటీ ఇచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ప్రస్తుత దేశ బ్యాంకుల పొదుపు ఖాతాలపై అనుసరిస్తున్న కనీస సగటు నిల్వ మొత్తం నిబంధనలో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ హైయెస్ట్ గా ఉండడం గమనార్హం . HDFCలో గరిష్టంగా 10,000 కనీస నగదు నిబంధనను అమలు చేస్తున్నారు.  ఇక AXIS బ్యాంకులో అయితే మొత్తం 12000 గా ఈ నెంబర్ ఉంది . మినిమం బాలన్స్ లేకపోతే కస్టమర్ల నుంచి బ్యాంకులో కొంత మొత్తం చార్జీలు వసూళ్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: