సత్యమేవ జయతే... ఇప్పటి జనరేషన్ లో ఇటువంటి పదాలు వినడం కాస్త కష్టమే. అయితే అలాగని అందరూ సత్యం పలకరని కాదు. కానీ ఇప్పటి కాలంలో మనం మొదట పిల్లలకు చిన్న తనం నుంచి నేర్పించాల్సిన విలువల్లో 'సత్యాన్ని మాత్రమే పలకాలి' అనేది చాలా ప్రదానమైనది. ఎందుకంటే ఇప్పట్లో చాలా మంది పిల్లలు ఎక్కువుగా చిన్న చిన్న విషయాలకు కూడా భయపడి సులభంగా అబద్దం మీద ఆధారపడి నిజానికున్న విలువను పోగొడుతున్నారు. అయితే అదే అలవాటుగా మారే అవకాశం ఉంది. అయితే ఇది పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే వారికి చిన్న తనం నుండే సత్యం యొక్క విలువను తెలియచెప్పాలి.

ఇలా చేయడం ద్వారా మనము వారి బంగారు భవిష్యత్తుకు తొలి మెట్టును ఎక్కించిన వారమవుతాము. ఈ విషయాన్ని చెప్పే మార్గంలో 'కొన్ని చక్కని అర్ధం అయ్యాయి ఉదాహరణల ద్వారా వివరించేందుకు ప్రయత్నించాలి. అంతే కానీ వారిని నిజం చెప్పండి అని గదమాయించడం చేయకూడదు. అలా చేస్తే తప్పని ఒక పాఠంలా చెబుతూ ఉండాలి. ఇలా చేయడం వలన వారికి అది అలవాటుగా మారిపోతుంది. అదే  పెద్దయ్యాక కూడా వారికి గుర్తుండి పోతుంది. సత్యం చెప్పడం ద్వారా కొన్నిసార్లు వారికి కాస్త సమస్యగా మారుతుందని అనిపించినా సరే వారు అలవాటు తప్పలేక సత్యమే చెబుతారు. ఇలా చేయడం ద్వారా అప్పటికి కాస్త ఇబ్బంది అనిపించినా ఆ తరువాత పెను సమస్యలు పెరగకుండా దోహదపడుతుంది.

అదే అసత్యం చెప్పడం ద్వారా జీవితంలో శాంతి అనేదే వుండదు, ప్రతిక్షణం దాచిన నిజం ఎక్కడ బయటపడుతుందా అని ఒక కంగారు, భయం మనలో ఉంటుంది. కొన్ని సార్లు ఆ అసత్యం మన జీవితానికే పెను ముప్పులా మారే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి పరిస్తితులలో అయినా సరే సత్యాన్నే పలకాలి. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి మీ పిల్లలకు ఎటువంటి గుణాన్ని నేర్పుతారో. మీ పిలల్ల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: