మీ పిల్లలు మీ మాట వినాలి అనుకుంటున్నారా ? మీరు కోరుకున్న విధంగా వారు విజయాన్ని అందుకుని గొప్ప స్థాయిలో నిలవాలి , అందరి ముందు సగౌరవంగా జీవించాలి అనుకుంటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి. తల్లితండ్రులకు పిల్లలే జీవితం. వారి భవిష్యత్తే తమ ధ్యేయం గా మలచుకుని పయనిస్తుంటారు , తాము ఏమై పోయినా పర్వాలేదు, ఎంత కష్టపడ్డా పర్వాలేదు. కానీ తమ పిల్లలు మాత్రం సౌకర్యవంతంగా జీవించాలని కోరుకున్నది సాధించి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అలా పిల్లలు అనుకున్నది సాధించాలి అన్నా, మీరు కోరుకున్న విధంగా జీవించాలి అన్నా వారిలో క్రమశిక్షణ తప్పక అవసరం.

ప్రతి విషయంలో క్రమశిక్షణ తప్పనిసరిగా అవసరమని చెప్పలేము కానీ, సంతోషంగా జీవనం సాగించడానికి ఒక క్రమబద్దీకరణమైన జీవితం మాత్రం తప్పక అవసరం. అన్ని విషయాలలోనూ పిల్లల్ని కట్టడి చేయాలని చూడకండి అలాగే గారాబం ఎక్కువైన ఇబ్బందే. అదే విధంగా వారికి భవిష్యత్తు పై అవగాహన పెంచండి, లక్ష్యం యొక్క విలువను తెలియచేయండి. లక్ష్యం ఎందుకు అవసరం , లక్ష్యాన్ని సాధించడం కోసం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి, ముందు చూపు, సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా...ఇలాంటి వాటిపై అవగాహన పెంచండి. మీరు ఒక పేరెంట్ లా కాకుండా ఒక స్నేహితుడి లా స్వేచ్చాయుత మార్గదర్శకం చేయండి.

వారిని స్వేచ్చగా నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించండి. అలాగే వారి గుణగణాలు సక్రమంగా ఉండేలా చూసుకోండి, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనమంతా ఒక సమాజంలో జీవిస్తున్నాం. ఈ సమాజంలో మనం మాత్రమే కాదు.... అలాంటప్పుడు ఎవరికి మన ప్రవర్తన వలన కానీ, మన వైఖరి వలన కానీ, లేదా నిర్ణయాల వలన కానీ  నష్టం , హాని జరగకూడదు అన్న విషయాన్ని వారికి అర్దం అయ్యేలా చెప్పాలి. అనుకున్నది సాధించడం ఎంత ముఖ్యమో అదే సమయంలో మన లక్ష్య మార్గం ఇతరులకు ఇబ్బందికరంగా కాకుండా చూసుకోవడం కూడా అంతే ప్రదానం అని తెలిసేలా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: