గర్భస్రావం అనేది స్త్రీ జీవితంలో అత్యంత బాధాకరమైన పరిస్థితులలో ఒకటి, అది అనేక భావోద్వేగాలను కలిగిస్తుంది. మొదటిసారి తల్లి కాబోతున్నవారికి మరియు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది.గర్భస్రావం (మిస్ కేరేజ్) అంటే గర్భధారణ యొక్క 20 వారాల కంటే ముందు పిండానికి సహజంగా  హాని కలుగడం.కొంతమంది మహిళలకు అసలు గర్భస్రావం కావడానికి ముందు వారు గర్భవతి అనే విషయం కూడా తెలియకపోవచ్చు.




అయితే దీని వల్ల మీరు మళ్ళీ బిడ్డను కనలేరని కాదు. బహుళ గర్భస్రావాలు సంభవించడం చాలా అసాధారణం. ఇవి 100 మంది మహిళల్లో ఒకరిలో సంభవించవచ్చ. కుటుంబం సభ్యులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో స్త్రీకి అన్ని విధాలా వారి సహకారం అవసరం. ఆమె ఇంకా బాధను ఎదుర్కొంటున్నప్పుడు ఆమెను మరొక గర్భం కోసం కంగారు పెట్టడం కూడా మంచిది కాదు.ఆమె మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సరైన కౌన్సిలింగ్ మరియు మార్గదర్శకత్వం అందించాలి, అందువల్ల ఆమె గర్భాన్ని కోల్పోతుందనే లేదా గర్భధారణ పట్ల భయం ఏర్పడదు.పిండం యొక్క గర్భస్రావానికి అనేక ప్రమాద కారకాలు ముడిపడి ఉంటాయి. వీటిలో వృద్ధాప్యం, ఊబకాయం,  మద్యం, ధూమపానం వంటి జీవనశైలి అలవాట్లు ఉన్నాయి. అయితే, సాధారణంగా  స్త్రీ దీనికి బాధ్యత కలిగి ఉండదు.


ప్రతి బిడ్డ తన తల్లి తండ్రి నుండి చెరో సగం డీఎన్ఏ (DNA) ను పొందుతుంది, కాబట్టి, తల్లిదండ్రుల క్రోమోజోమ్ నిర్మాణంలో ఏదైనా అసాధారణత పిండానికి బదిలీ చేయబడుతుంది. పిండంలో అసాధారణమైన
క్రోమోజోమల్ నిర్మాణం  వలన గర్భస్రావం అవుతుంది.అలాగే, తల్లిదండ్రులు వారి డీఎన్ఏ లో ఏవైనా  అసాధారణతలు కలిగి ఉన్నారా అని తనిఖీ చేసే క్రోమోజోమ్ పరీక్షలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో గర్భం ధరించడానికి ఉత్తమమైన మార్గాల గురించి మీరు వైద్య సలహా పొందవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవైనప్పటికీ, పునరావృత గర్భస్రావాలు జరిగితే సాధారణంగా డీఎన్ఏ విశ్లేషణ పరీక్ష సూచించబడుతుంది. కాబట్టి, ఇది ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. అలాగే థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా గర్భస్రావం అవుతుంది.. మరికొన్ని కారణాలు తదుపరి వ్యాసంలో చూద్దాం.. !!


మరింత సమాచారం తెలుసుకోండి: