
ఇలాంటి వారిలో డాక్టర్ సరిపల్లి శ్రీజారెడ్డి అగ్రగణ్యురాలు. వైద్య రంగంలో ఎవరూ ఇప్పటి వరకు చేయలేని, చేయని సేవ చేస్తూ.. చరిత్ర సృష్టిస్తున్నారు. తమ కుటుంబంలో వెలుగు చూసిన ఒక సమస్యను అధ్యయన ం చేసి.. పరిష్కరించుకున్నారు. అయితే.. ఆమె అక్కడి తో ఆగిపోలేదు. తనలాంటి తల్లులకు కూడా సాయం చేయాలని తలపోశారు. ఈ క్రమంలోనే సమాజ హితం కోసం.. నడుంబిగించారు. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల తరఫున అలుపెరుగని పోరు చేస్తున్నారు.
దేశమంటే మట్టికాదోయ్.. మనుషులోయ్! అన్న గురజాడ సూక్తి ఆలంబనగా.. దేశానికి సేవ చేయడం అంటే.. ప్రజలకు సేవచేయడమే అని త్రికరణ శుద్ధిగా నమ్మి.. ఆటిజంతో అలమటిస్తున్న చిన్నారులకు అన్నీతానై వ్యవహరించారు. అమ్మగా అనేక మంది చిన్నారులకు బుద్ధి నేర్పుతున్నారు. వారిలో తలెత్తిన ఆటిజం సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. అటిజం సమస్య కోసం అనేకానేక పరిష్కారాలు కనుగొని థెరపీ ద్వారా చిన్నారులకు శిక్షణ ఇచ్చి వారిని మామూలు మనుష్యులను చేయడంలో పినాకిల్ బ్లూమ్స్ ను మించిన సంస్థలు లేవంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటికే వేల మంది చిన్నారులకు పినాకిల్ బ్లూమ్స్ ద్వారా చికిత్స అందిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల చిన్నారులకు సైతం శిక్షణల ద్వారా సేవలు అందిస్తున్నారు. అటిజం శిక్షణలో పినాకిల్ ఎందుకు సక్సెస్ అయ్యిందో అక్కడ ఫలితాలే ప్రామాణికం అని చెప్పాలి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి