మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నార్మల్ టైం కంటే.. గర్భిణులుగా ఉన్నప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆహార నియమాలు పాటించడంలో కఠినత్వంగా వ్యవహరించాలి. అప్పుడే పుట్టబోయే పాపకు మంచిది. నార్మల్ టైం కంటే గర్భిణులుగా ఉన్నప్పుడు మహిళలు ఎక్కువగా ఆహారం తింటుంటారు. చిరుతిండి, జంక్ ఫుడ్‌లను అమితంగా ఇష్టపడుతుంటాయి. అయితే అలాంటి టైంలో ఆ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. ఆశను చంపుకోలేక ఆరగించేస్తుంటారు.

అయితే గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లోనూ జంక్ ఫుడ్‌ను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో జంక్ ఫుడ్ తినడం వల్ల ఎన్నో నష్టాలు వస్తాయని వారు పేర్కొంటున్నారు. అయితే జంక్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి నష్టం చేకూరుతుంది.. వాటిని అధిగమించాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం.. చిరు తిండి, జంక్ ఫుడ్ తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. నోటికి ఎంతో రుచిగా అనిపించినా.. వాటిలో ఎలాంటి పోషకాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. గర్భిణులు వీటిని తినడం వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే పిల్లాడికి మెదడు, గుండె, ఊపిరితిత్తులు, ఎముకల సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది.

జంక్ ఫుడ్ పిల్లల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే గర్భిణీగా ఉన్నప్పుడే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలని, జంక్ ఫుడ్‌కు దూరం చేయాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జంక్ ఫుడ్ తయారీకి ఉప్పు, మసాలాలు అధికంగా వాడుతుంటారు. వాటిని తిన్న గర్భిణులకు తరచూ రక్త పోటు స్థాయిలో మార్పులు వస్తుంటాయి. బరువు కూడా అధికమవుతుంది. దీని వల్ల నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. డెలివరీ టైంలో కూడా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. అందుకే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను అవాయిడ్ చేయాలని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: