భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇంకా అతి పెద్ద బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) దేశీయ మార్కెట్లో తన కొత్త 'ప్యాషన్ ఎక్స్‌టెక్' (Passion XTEC) ని విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 74,590 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.ఇక ఇండియన్ మార్కెట్లో విడుదల అయిన ఈ కొత్త 'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' (Hero Passion XTEC) బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి అవి ఎక్స్‌టెక్ డ్రమ్ వేరియంట్ (రూ.74,590) ఇంకా ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్ (రూ.78,990). ఇక ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ మార్పులు బ్లూటూత్ కనెక్టివిటీ ఇంకా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇప్పుడు ఈ కొత్త బైక్ ఈ రెండు లేటెస్ట్ ఫీచర్స్ ని కూడా పొందుతుంది. కాబట్టి వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.ఇక హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ బైక్ లో ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉండటం వల్ల వాహన వినియోగదారుడు స్మార్ట్‌ఫోన్‌కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.


ఇంకా బ్లూటూత్‌కు కనెక్ట్ అయిన తర్వాత, బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కాల్ అలర్ట్‌, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ ఇంకా అలాగే లో-ఫ్యూయెల్ వార్ణింగ్ లైట్ ఇంకా అలాగే సర్వీస్ రిమైండర్‌ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.ఇక అంతే కాకుండా మీ మొబైల్ బ్యాటరీ లెవెల్ కూడా ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ చార్ తక్కువగా ఉంటే అక్కడున్న యుఎస్బి ఫోర్ట్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది రైడింగ్ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ కొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ మంచి డిజైన్ ని కూడా పొందుతుంది. ఇందులో ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ అనేది అందుబాటులో ఉంది. అలాగే ఇది హాలోజన్ ల్యాంప్‌ల కంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీనితోపాటు ఈ బైక్ పైన మీరు బ్రాండ్ లోగో వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇది చాలా ఏరోడైనమిక్ గా కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: