హ‌త్యాచార దోషుల‌కు మ‌ర‌ణ దండ‌న విధించ‌డానికి, వారి చేతిలో అఘాయిత్యాల‌కు గురైన బాధితులు చిన్నారులు అన్న ఒకే కార‌ణం స‌రిపోద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసిన‌ది. ఇర‌ప్ప సిద్ధ‌ప్ప అనే వ్య‌క్తి ఐదేండ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డి,  ఆ త‌రువాత ఆమెను చంపివేశాడు. ఆ శ‌వాన్ని ఓ సంచిలో కుక్కి కాలువ‌లో ప‌డేసాడు. విచార‌ణ చేప‌ట్టిన దిగువ కోర్టు సిద్ధ‌ప్ప‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన‌ది. క‌ర్ణాట‌క హైకోర్టు కూడ తీర్పును స‌మ‌ర్థించింది. అయితే చివ‌రికి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన‌ది. విచార‌ణ చేప‌ట్టిన  జ‌స్టిస్ ఎల్.నాగేశ్వ‌ర్‌రావు, జ‌స్టీస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టీస్ బి.ఆర్‌.గ‌వాయిల ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం రోజు తీర్పును వెల్ల‌డించిన‌ది. అయితే సిద్ధ‌ప్ప నేరానికి పాల్ప‌డిన‌ట్టు కింది కోర్టులు అత‌నికి విధించిన మ‌ర‌ణ శిక్ష‌ను ర‌ద్దు చేసి 80 ఏళ్ల జీవిత‌ఖైదుగా మార్పు చేసింది సుప్రీంకోర్టు.

బాధితురాలు కేవ‌లం చిన్నారి అనే ఒకే కార‌ణంతో దోషికి మ‌ర‌ణ‌శిక్ష విధించ‌లేమ‌ని, గ‌త 40 ఏళ్ల‌లో సుప్రీంకోర్టు దృష్టికి ఇలాంటి కేసులు దాదాపు 67 వ‌చ్చాయని, ఇలాంటి వాట‌న్నింటిలో బాధితులు మైన‌ర్లు అన్న కార‌ణంతో దిగువ కోర్టులు దోషుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాయి. ఇప్ప‌టివ‌ర‌కు 12 కేసుల్లో మాత్ర‌మే సుప్రీంకోర్టు మ‌ర‌ణ శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ తీర్పును ఇచ్చింద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. కానీ అత‌ని శిక్ష‌ను త‌గ్గించ‌కూడ‌దని, ముందుగా విడుద‌ల చేయ‌కూడ‌దనే ష‌ర‌త్ విధించింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: