రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేసేలా కార్యాచరణ రూపోందించాలని ఏపీ వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి విడదల రజని సూచనలిచ్చారు.  సాధారణ ప్రసవాల విషయంలో తెలంగాణాలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి విడదల రజని  స్పష్టం చేశారు. మాతా శిశు సంరక్షణలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలూ తెలుసుకోవాలని మంత్రి విడదల రజని  సూచించారు. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోని మంత్రి కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి విడదల రజని సమీక్ష నిర్వహించారు.


ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి విడదల రజని స్పష్టం చేశారు.  సీజనల్ వ్యాధుల సమాచారాన్ని తెప్పించుకోవాలని ఉన్నతాధికారులు కృష్ణబాబు, జె.నివాస్ లను మంత్రి విడదల రజని ఆదేశించారు.  సికిల్ సెల్, తలసేమియా వ్యాధులపైనా అవగాహన కల్పించాల్సిందిగా  మంత్రి విడదల రజని సూచించారు. ఉద్దానంలో నెఫ్రాజిస్టుల సేవలను రూ. 5 లక్షల వరకూ ప్యాకేజీ ఇచ్చి నెఫ్రాలజీ నిపుణుల్ని నియమించుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: