అందం అనేది పుట్టుకతోనే రావాలి.బాహ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అది కొంతకాలం మాత్రమే నిలుస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతకాలంలో అందంగా ఉండటానికి ఎన్నో సర్జరీలు, మార్కెట్లో లభ్యమయ్యే ఎన్నో రసాయనాలు కలిగిన క్రీములను తీసుకొచ్చి, ముఖాన్ని మెరిపించేందుకు తహతహలాడుతున్నారు ప్రస్తుతకాలంలో యువత. అయితే వీటి వల్ల ముఖంలో కల పోయి, చర్మ రంధ్రాలు మూసుకుపోయి, ముఖమంతా మొటిమలతో అందవిహీనంగా తయారవుతుంది. ఇక పోనుపోను ముఖానికి మేకప్ లేకపోతే,మన ముఖాన్ని మనమే చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టే రోజులు వచ్చాయి. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన పెద్దలు పూర్వకాలంలో ఎలాంటి కాస్మెటిక్స్, క్రీమ్స్ వాడకుండానే వారి అందాన్ని స్వతహాగా, సహజత్వంగా అందాన్ని తీర్చిదిద్దుకునేవారు. మరి అంతటి అద్భుతమైన అందానికి వారు ఉపయోగించేది ఏమిటంటే సున్నిపిండి. సున్నిపిండి వినడానికి ఆశ్చర్యమేస్తుంది,కానీ దీనిలో నింపుకున్న ఔషధ గుణాలేంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.

ఇప్పట్లో సున్నిపిండి గురించి తెలిసిన వారు చాలా తక్కువ. కాలంతో పాటు మనుషులు కూడా పరుగులు తీస్తున్న ఈ కాలంలో, సున్నిపిండితో ఒళ్ళు రుద్దుకుని స్నానం చేసే వారు చాలా తక్కువ. ఇన్స్టెంట్ పేరిట రంగు రంగుల తో పాటు వివిధ రకాల సువాసనలను వెదజల్లే సబ్బులు అందుబాటులోకి వచ్చాక,సున్నిపిండి విలువ మర్చిపోతున్నాం.

శరీరాన్ని పోషించడంలో చర్మానికి చక్కని రంగు తీసుకురావడంలో సున్నిపిండి అద్భుతంగా పనిచేస్తుంది. సున్నిపిండిని రోజుకొకసారి ఒళ్ళంతా రుద్దుకొని, స్నానం చేస్తే చర్మం మీద ఉన్న ముడతలు,పగుళ్లు, జిడ్డు వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

సున్నిపిండిని నీళ్ళల్లో కలిపి చిక్కటి మిశ్రమం లా చేసి,వాడుకుంటే బొల్లి వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. చర్మంలోని స్వేద గ్రంధులలో మార్పు వల్ల మెదడులోని నాడీ కేంద్రాల మార్పు వల్ల, కొందరికి చర్మం పైన వంద డిగ్రీల జ్వరం ఉన్నట్లు శరీరానికి తగినంత చెమట పట్టకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు సున్నిపిండితో రోజూ ఉదయం,సాయంత్రం స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నలుపు రంగు ఉన్నవారు కూడా సున్నిపిండిని వాడడం వల్ల తెలుపు రంగులోకి మారతారు.

 సున్ని పిండి ఎలా తయారు చేసుకోవాలి అంటే?  పెసలు, బావంచాలు,ఖర్జూరాలు, పసుపు మొదలైనవి సేకరించి, మెత్తగా మరపట్టించి వాడుకోవచ్చు. అయితే ఇందులో పెసలు ఎక్కువగా వేసి, మిగిలినవన్నీ ఒకే పరిమాణంలో కొలత తీసుకొని,తయారు చేసుకోవాలి. చర్మానికి తగినంత తేమ అందించడానికి సున్నిపిండి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా చెమట దుర్వాసన నుంచి మనల్ని కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: