ప్రస్తుత కాలంలో చాలా మందికి కూడా కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది. దీని వల్ల వారు పలు అరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది వ్యాయమాలు చేయకపోవడం ఇంకా తీసుకునే ఆహారం వల్ల కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది.ఇక దీంతో అనారోగ్య సమస్యలతో చాలా మంది సతమతమవుతున్నారు. మన సరైన ఆహార నియమాలు పాటించినట్లయితే కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ఇక తియ్య తియ్యటి స్ట్రాబెర్రీలను తినడానికి చాలా మంది కూడా ఇష్టపడుతుంటారు. అలాగే ఈ పండ్లను సౌందర్య సాధనాల్లో కూడా వాడుతుంటారు. తియ్యగా ఉన్న ఈ స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇవి బాగా సహాయపడుతాయి. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో చర్మ సమస్యలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.యాపిల్ పండ్లలో కూడా ఆరోగ్యకరమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. 

ఇక ప్రతిరోజూ కూడా ఒక యాపిల్ తింటే అసలు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లనవసరం లేదంటుంటారు. ఎందుకంటే యాపిల్ లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అలాగే ఫైబర్ కంటెంట్‌ కూడా తగిన శాతంలో ఉండటంతో ఆరోగ్యానికి ఈ పండు చాలా మంచిది.నారింజ, నిమ్మ ఇంకా అలాగే ద్రాక్ష పండ్లు. ఇవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు. ఈ పండ్లలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చలికాలంలో బాగా లభిస్తాయి. ఈ పండ్లు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో వుండే విటమిన్ సీ ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది.ఇక కొలెస్ట్రాల్‌ కోసం ద్రాక్ష పండ్లు కూడా మన ఆరోగ్యకరమైన బరువుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి బరువు తగ్గడంతో చాలా మంచి పాత్రనే పోషిస్తాయి. ఇక మన బాడీలో వుండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ద్రాక్ష పండు ఎంతగానో సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో కూడా రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: