మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోయానని అన్నారు. జ్యోతిరాధిత్య సింధియా, బీజేపీ చేసిన కుట్రలు తనకు ముందుగానే తెలుసని కానీ కాంగ్రెస్ ను విడిచి ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లరని దిగ్విజయ్ చెప్పిన మాటలు తాను నమ్మానని అన్నారు. 
 
దిగ్విజయ్ సింగ్ కూడా ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని భావించి ఉండకపోవచ్చని... అప్పటి పరిస్థితులను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యామని చెప్పారు. బీజేపీ అగ్ర నేతలతో సింధియా టచ్ లో ఉన్నారని జులై నుంచే తనకు తెలుసని అన్నారు. లక్ష ఓట్ల తేడాతో కాంగ్రెస్ కార్యకర్త చేతిలో ఓడిపోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారని చెప్పారు. 
 
బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సింధియాను చేర్చుకోవడం ఇష్టం లేకపోయినా మధ్యప్రదేశ్ నుంచి రెండో రాజ్యసభ సీటు సాధించాలని ఆయనను పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: