అభిమానుల క్షేమం కోరుకునే హీరోలో ఎన్టీఆర్ ముందంజలో ఉంటాడు.అభిమానులు కష్టంలో ఉంటే సాయం చేసేందుకు ముందుండే వ్యక్తుల్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయం నిరూపించుకోగా.. తాజాగా అనారోగ్యంతో భాధ పడుతున్న తన అభిమాని వెంకన్నతో సంభాషించారు జూనియర్ ఎన్టీఆర్. ఇక స్వయంగా ఎన్టీఆర్ అంతటివాడు తనకు ఫోన్ చేయడం, అది కూడా వీడియో కాల్ చేయడంతో అభిమాని అయిన వెంకన్న ఆనందం అంతాఇంతా కాదు.

ఇక వెంకన్న మాట్లాడుతూ.. మిమ్మల్ని ఇలా లైవ్ లో చూడడం సంతోషంగా ఉంది. ఇది మర్చిపోలేని రోజు" అని వెంకన్న సంతోషం వ్యక్తం చేశాడు. "మీరు ఒక్క సెల్ఫీ ఇస్తే చాలు... నాకు ఇంకేమీ వద్దు" అని వెంకన్న ఎన్టీఆర్ ను కోరాడు. అందుకు ఎన్టీఆర్ బదులిస్తూ... "కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత తప్పకుండా మనిద్దరం సెల్ఫీ దిగుదాం" అని హామీ ఇచ్చారు. అప్పటివరకు నువ్వు బలమైన ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో వెంకన్న మిమ్మల్ని కలవాలన్న ఒకే ఒక్క ఆశతో బతుకుతున్నా" అని తెలిపాడు. ఆ అభిమాని సమాధానం ఎన్టీఆర్ హృదయాన్ని తాకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: