తెలంగాణాలో చదువుల తల్లి లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. చదువుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యకు పాల్పడింది. చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న బలమైన కాంక్ష ఒకవైపు, కాలేజ్ రుసుము, హాస్టల్ ఫీజు కట్టలేనంత పేదరికం మరోవైపు, చివరికి ఆ చిట్టితల్లి చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ షాద్
నగర్ కు చెందిన విద్యార్థిని
ఐశ్వర్య రెడ్డి. తన అసమాన్యమైన ప్రతిభతో ప్రతిష్టాత్మక
ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించుకుంది.
ఈ సందర్భంగా తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో చెబుతూ ఒక లేఖకూడా రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి చివరికోరిక ఏంటంటే, కనీసం ఒకేడాది అయినా స్కాలర్ షిప్ వచ్చేలా చూడండి అంటూ రాసింది. తన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందుల్ని కొంతైనా తొలిగించేందుకు ఆ ప్రస్తావన చేసింది. ఆ
లేఖ పూర్తిపాఠం ఇక్కడ చూడొచ్చు.
తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచిపోయింది