ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్తి కాగా.. మూడో విడతలో 80.64 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది.
అయితే ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల ఆధారంగా.. టీడీడీ,
వైసీపీ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం అత్యధిక స్థానాల్లో
టీడీపీ విజయం సాధించి ముందంజులో ఉంది. ఇప్పటివరకూ మొత్తం 200 స్థానాల్లో
టీడీపీ, 199 చోట్ల
వైసీపీ,
జనసేన 3, ఇతరులు 19 స్థానాల్లో గెలుపొందారు.