
ప్రపంచ కప్ స్టేజ్ 3 లో బంగారు పతకాలు సాధించిన హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో స్టార్ ఇండియన్ ఆర్చర్ దీపిక కుమారి సోమవారం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు. 2012 లో తొలిసారిగా అగ్రస్థానాన్ని సాధించిన రాంచీకి చెందిన 27 ఏళ్ల యువతి, మూడు వ్యక్తిగత పునరావృత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించింది.ఇక ఈ సందర్బంగా చాలా మంది ప్రముఖులు దీపికకు శుభాకాంక్షలు తెలిపారు.ఇక అలాగే ప్రముఖ హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు.ఎప్పటి లాగే తన ట్విట్టర్ వేదికగా దీపికను అభినందించారు."ఉత్తేజకరమైన ఇంకా నమ్మశక్యం కానటువంటి విజయం! ఆర్చరీ ప్రపంచ కప్‌లో స్వర్ణం సాధించినందుకు దీపిక కుమారి ఇంకా జట్టుకి అభినందనలు!" ట్వీట్ చేశారు.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.