కేసీఆర్ ఏం చెప్పినా అదంతా తెలంగాణ సంక్షేమం తెలంగాణ అభివృద్ధి కోస‌మే అని చెప్పేలా ఉంటాయి ఆయ‌న మాటలు.. ఏం చెప్పినా కూడా అందుకు త‌గ్గ నేప‌థ్యం ఒక‌టి ఆయ‌న ఎంచుకుంటారు.. ఆ విధంగా మాట‌ల‌కు చాతుర్యం  ఆపాదించి త‌న‌దైన  వాగ్ధాటితో ఇత‌రుల‌ను సునాయాసంగా ఆక‌ట్టుకోవ‌డంలో ఆరితేరిన విద్య ఒక‌టి కేసీఆర్ ఎన్న‌డో నేర్చేశారు. ఉద్య‌మ కాలంలో కూడా తీవ్రం అయిన వ్యాఖ్య‌లు చేస్తూనే కొన్ని చ‌లోక్తులూ విసిరి స్థానిక భాష‌లో ఉన్న సొబ‌గును ఎప్ప‌టిక‌ప్పుడు వివరిస్తూ దూసుకుపోయారు..తాజాగా ఆయ‌న ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో అవ‌గాహ‌న స‌ద‌స్సు ఏర్పాటు చేసి నాలుగు మంచి మాట‌లు చెప్పారు.. త‌న ధోర‌ణికి భిన్నంగా అధికారుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తూ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతోనే అభ్యున్న‌తి సాధ్య‌మ‌ని మోటివేష‌న్ స్పీచ్ ఇచ్చారు. ద‌ళిత బంధు అన్న‌ది ప‌థకం కాద‌ని ఉద్య‌మం అని
అన్నారు. ఇదే సంద‌ర్భంలో విజ‌యానికి సంబంధించి చెప్పిన మాట‌లు వ్య‌క్తిత్వ వికాస నిపుణుడ్ని త‌ల‌పించాయి. తాను అనుకున్నది చేసి తీరుతాన‌ని ద‌ళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా అమ‌లు చేస్తాన‌ని చెప్పి మ‌రో మారు త‌న సంక‌ల్పం ఏంట‌న్న‌ది సుస్ప‌ష్టం చేశారాయ‌న.

మరింత సమాచారం తెలుసుకోండి: