మహారాష్ట్రను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా మహారాష్ట్రలోని పలు జిల్లాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రత్నగిరి, సాంగ్లి, కొల్హాపూర్, రాయ్గడ్ సహా వివిధ జిల్లాల్లో భారీ వరదలు రావడంతో కనీసం 209 మంది మరణించగా, 4,34,185 మందిని ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి నిస్సహాయంగా మారడంతో రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు తమ ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

"సామాన్యులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న నష్టాల దృష్ట్యా బిజెపి ఎమ్మెల్యేలు తమ ఒక నెల జీతం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నారు. రాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం శాసనమండలి, అసెంబ్లీ సభ్యుల జీతాలను సహాయ నిధిలో ఉపయోగించాలని, బాధిత ప్రజలకు సాధ్యమైనంత వరకు సహాయ, పునరావాస పనులకు రాష్ట్రం సహాయం చేయాలని బిజెపి భావిస్తోంది. ఇప్పటికే ఎన్‌సిపికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ ఒక నెల జీతం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: