తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి మళ్లీ నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ తన బాబాయి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన సుబ్బారెడ్డికి 2019 ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికిచ్చారు. బాబాయికి న్యాయం చేస్తానని మాట ఇవ్వడంతో అందుకు అనుగుణంగా టీటీడీ చైర్మన్ పదవిచ్చారు. రెండున్నర సంవత్సరాల పదవీకాలం పూర్తవడంతో కొద్దికాలం చైర్మన్ పదవిని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. తిరిగి ఈరోజు వైవీ సుబ్బారెడ్డినే నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. పాలకమండలిని మాత్రం ప్రకటించలేదు. సభ్యులుగా తమను నియమించాలంటే తమను నియమించాలంటూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంటుండటంతో ప్రభుత్వానికి ఏంచేయాలో అర్థంకాక తలపట్టుకుంటోంది. కేంద్ర మంత్రుల నుంచి కూడా తమవారిని టీటీడీ సభ్యులిగా నియమించాలంటూ ఒత్తిడి వస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి