ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందంటూ షాకింగ్ కామెంట్ చేశారు. విద్యుత్ కేంద్రాల్లో ఒక రోజుకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు. వెంటనే బొగ్గు సరఫరా... గ్యాస్ సరఫరా అందించాలని కేంద్రాన్ని కోరారు. బహిరంగ మార్కెట్ లో యూనిట్ కరెంట్ ధర 20 రూపాయలకు పెంచారని దాన్ని నియంత్రించాలని కోరారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు అవకాశాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.

విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధ్యమైనంత వరకు తాము పని చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ జోక్యం చేసుకోవాలంటూ అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఇది ఇలా ఉంటే ఇటీవల కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలోనే బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. బొగ్గు నిల్వలు తగ్గినట్లయితే విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి  విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: