క‌రోనా వైర‌స్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండ‌టంతో వాటినుంచి అడ్డుక‌ట్ట వేయ‌డానికి బూస్ట‌ర్ డోస్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంత‌ర్జాతీయ వైద్య‌నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌సారి డోసు వేయించుకున్న త‌ర్వాత కొన్ని నెల‌ల‌కు శ‌రీరంలో యాంటీ బాడీలు త‌గ్గిపోతుండ‌టాన్ని గ‌మ‌నించిన వైద్య‌నిపుణులు రెండు డోసులు వేయించుకున్న వారికి మ‌రో ఆరునెల‌లు విరామం ఇచ్చి బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని సూచిస్తున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ కార్బివాక్స్ ను త‌యారుచేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌యోగ ద‌శ‌ల్లో మూడోద‌శ‌ను పూర్తిచేస్తోంది. తాము త‌యారుచేసిన కార్బివాక్స్ నుచ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ వేయించుకున్న‌వారికి బూస్ట‌ర్‌డోస్ గా వేయ‌డానికి అనుతివ్వాలంటూ ఔష‌ధ నియంత్ర‌ణ ప్ర‌మాణాల సంస్థ‌కు ద‌ర‌ఖాస్తు చేసింది. ఈ టీకాకు ఇంకా డీసీజీఐ అనుమ‌తులు రాక‌ముందే కేంద్ర ప్ర‌భుత్వం 30 కోట్ల డోసుల‌కు బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గాను రూ.1500 కోట్లు ముంద‌స్తుగా చెల్లించింది. కార్బివాక్స్ ను బూస్ట‌ర్ డోస్‌గా ఇచ్చేందుకు అనుమ‌తులివ్వాలంటూ డీసీజీఐకి ఇప్ప‌టికే ఈ సంస్థ ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: