తెలంగాణ రైతుల‌కు దీపావ‌ళి  ముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓ శుభ‌వార్త చెప్పారు. పోడు భూముల‌పై సీఎం ఒక  కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న‌వంబ‌ర్ 08 నుండి పోడు భూముల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ కోసం ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గంజాయిసాగు చేసే రైతుల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. ఆర్ఓఎఫ్ఆర్ఓలో ఎవ‌రైనా  గంజాయి సాగు చేస్తే వారి పట్టాలను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వారికి అస‌లు  పోడుభూముల ప‌ట్టాలు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు. గంజాయిని ఎవ‌రైనా సాగు చేసిన‌ట్ట‌యితే వారికి  ప్ర‌భుత్వం నుంచి అందే అన్నీ సౌక‌ర్యాలు ర‌ద్దు చేస్తాం అని ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో 87 శాతం అట‌వీ భూములు ఉన్నాయ‌ని.. అవి 12 జిల్లాల‌లోనే ఉన్నాయ‌ని పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను అధికారులు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. అడ‌వి మీద ఆధార‌ప‌డే గిరిజ‌నుల‌కు మేలు చేసేవిధంగా ఉండాల‌ని తెలిపారు. అడవుల‌ను నాశనం చేసే కొన్ని శ‌క్తుల‌పై మాత్రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించారు. అట‌వీ భూముల ర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర క‌లెక్ట‌ర్లు వ‌హించాల‌న్నారు. అన్ని జిల్లాల‌లో అఖిల‌ప‌క్షాల స‌మావేశాలు నిర్వ‌హించి, అందులో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేసి వారి నిర్ణ‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: