హైద‌రాబాద్ ఇందిరాపార్కు వ‌ద్ద  అఖిల భార‌త రైతు పోరాట స‌మ‌న్వ‌య స‌మితి, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేర‌కు  ఇవాళ మ‌హాధ‌ర్నా నిర్వ‌హించారు. ఆలిండియా కిసాన్ మోర్చ నాయ‌కులు, రాష్ట్రం న‌లుమూలల నుంచి రైతుల సంఘాల నాయ‌కులు హాజ‌ర‌య్యారు. రైతులు చేప‌డుతున్న మ‌హాధ‌ర్నాకు ముఖ్య అతిథిగా రాకేష్ టికాయ‌త్ హాజ‌రై మాట్లాడారు. ప్ర‌ధాని మోడీ బ‌డా కంపెనీల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.  రైతు సంఘాలు అడిగిన ప్ర‌శ్న‌కు మోడీ ద‌గ్గ‌ర స‌మాధానం లేద‌ని రాకేష్ టికాయ‌త్ పేర్కొన్నారు.  కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ న‌డిపిస్తుందని స్ప‌ష్టం చేశారు.
రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేంత వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌ద‌ని  టికాయ‌త్ వెల్ల‌డించారు. శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌ద్ద‌తు ధ‌ర తీసుకురావాల‌ని డిమాండ్ చేసారు.

ఓ వైపు తెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొనుగోలుపై ఉద్య‌మం జరుగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఇవాళ ఇందిరాపార్కు వ‌ద్ద రైతుల సంయుక్త మోర్చ నాయ‌కులు టికాయ‌త్ హాజ‌రై.. రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుందని ఆందోళ‌న చేసే వారిని ప్ర‌లోబాల‌కు గురి చేశార‌ని గుర్తు చేశారు.  కానీ అంద‌రూ ఏక‌తాటిపై నిల‌బ‌డ్డార‌ని వివ‌రించారు.  భాష వేరు కావ‌చ్చు.. కానీ రైతులంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే అని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల రైతుల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తామ‌ని నిర్ణ‌యం ప్ర‌క‌టించింద‌ని, కానీ ర‌ద్దు చేసే వర‌కు పోరాటం కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు రాకేష్ టికాయ‌త్‌. రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర వంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎల్ల‌వేళ‌లా పోరాడుతాం అని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: