టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొవిడ్ నిర్ధరణతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చంద్రబాబు ఆ పోస్టులో తెలిపారు. కరోనా చికిత్సకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు.

నిన్ననే చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ కు కరోనా వచ్చింది. ఆయన కూడా తనకు కరోనా వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే చంద్రబాబు ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హత్యకు గురైన చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరికీ కరోనా సోకడంతో పార్టీ శ్రేణులు కాస్త ఆందోళనకు గురవుతున్నాయి. అయితే.. ఇప్పుడు వస్తున్న కరోనా కేసులు చాలా వరకూ పెద్దగా లక్షణాలు ఉండటం లేదు. కరోనా వచ్చినా రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటున్నారు.  అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: