మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక వచ్చిన ఆత్మకూరులో పోలింగ్‌ మొదలైంది. ఇక్కడ వైసీపీ కి ఎదురే లేకుండా పోయింది. టీడీపీ బరిలోనే లేదు.. బీజేపీ మాత్రమే ప్రధానంగా పోటీ ఇస్తోంది. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోబోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఉదయం 6 గంటలకు మాక్‌పోల్ నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల్లో  వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.


ఆత్మకూరు ఉపఎన్నిక కోసం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికకు సంబంధించి కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆత్మకూరు ఉపఎన్నిక సందర్భంగా కొవిడ్ ప్రొటోకాల్ అమలులో ఉంటుంది.  
మహిళ కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 78 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీసులు ఉన్నారు.  పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌ అమలులో ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: