ఏపీఎస్‌ ఆర్టీసీ రాష్ట్రంలో బస్సు ఛార్జీలను మరోసారి భారీగా పెంచింది. డీజిల్ సెస్‌తో పాటు కనీస ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ ఉత్తర్వులు ఇచ్చింది. విద్యార్థుల బస్‌పాసులు, సీజన్‌ పాసుల ఛార్జీలు కూడా పెంచింది. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.5 పెంచింది. దూరప్రాంత, ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10 పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు రూ.1.02 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. అల్ట్రా డీలక్స్ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.25. అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కిలోమీటర్‌కు రూ.1.55 ఛార్జీ ఉంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.40గా చేశారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు రూ.1.62 ఛార్జీ అవుతుంది.

ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50. కిలోమీటర్‌కు రూ.1.96 ఛార్జీ.. ఇంద్ర బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.140 గా ఉంది. గరుడ, మెట్రో లగ్జరీ, అమరావతి ఏసీ బస్సుల్లోనూ  దాదాపు ఇవే చార్జీలు ఉన్నాయి. అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ కిలోమీటర్‌కు రూ.2.49గా ఉంది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.80. వెన్నెల 30 బెర్తుల బస్సుల్లో కిలోమీటర్‌కు రూ 2.90 ఛార్జీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: