ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్  అన్నయోజన పధకం కింద ఇస్తున్న ఉచిత బియ్యం గత ఏప్రియల్ మాసం నుంచి వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం మానుకుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎందుకు రేషన్ బియ్యం నిలిపిందో తెలియని అయోమయ పరిస్ధితి జనంలో నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు తెలిపారు. అయితే.. బీజేపీ రాష్ట్ర శాఖ అప్రమత్తమై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని వచ్చిందని.. బీజేపీ క్షేత్ర స్ధాయిలో  ఉద్యమాలు చేయడంతో  ప్రభుత్వం దిగివచ్చిందని సోము వీర్రాజు అంటున్నారు.


ప్రజల కోసం ప్రభుత్వాన్ని  ఏ విధంగా దిగివచ్చేలా చేయాలో బీజేపీకి తెలుసునని సోము వీర్రాజు అన్నారు. బిజెపి ఉద్యమం ద్వారా మాత్రమే  ఇప్పుడు ఉచిత రేషన్ వస్తోందని సోము వీర్రాజు అన్నారు.  ఉచిత రేషన్ బియ్యం ఉద్యమంలో పాల్గొన్న  బిజెపి శ్రేణులను సోము వీర్రాజు మెచ్చుకున్నారు. ఆగస్టు 1 వ తేదీ నుంచి  గతంలో మాదిరిగా రేషన్ కార్డు దారులందరికీ  ఉచిత రేషన్ బియ్యం  విడుదల చేయాలని సోము వీర్రాజు కోరారు. నిబంధనల పేరుతో కేవలం  88 లక్షల మంది కార్డుదారులకే కాకుండా మిగిలిన 56 లక్షల కార్డుదారులకు కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: