ఆ ప్రాంతంలో వరుసగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఇది ఎక్కడంటే.. అనంతపురం జిల్లా దర్గాహొన్నూరులో.. ఇక్కడ రెండు కొద్దిరోజుల్లోనే రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగ పొలంలో మోటారు ఆన్ చేస్తుండగా రైతు వాణి మృతి చెందింది. తెగిపడిన విద్యుత్  తీగను చూసుకోకుండా మొక్కజొన్న పొలంలో మోటార్ ను ఆన్ చేసేందుకు ప్రయత్నించింది. షాక్ కొట్టి వాణి అక్కడికక్కడే మృతి చెందింది.

ఇదే బొమ్మనహాళ్  మండలం దర్గాహొన్నూరులో తరచూ విద్యుత్  ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనెల 2న దర్గాహొన్నూరులో కూలీలపై విద్యుత్  తీగ తెగిపడింది. ఈ  ఘటనలో ఏకంగా ఐదుగురు మృతి చెందారు. మంగళవారం రోజున పొలం వద్ద మరోసారి విద్యుత్  తీగ తెగిపడటంతో కూలీలు పరుగులు తీశారు. ఇప్పుడు వాణి మరణించింది. పొలంలో మోటార్  ఆన్  చేస్తుండగా మహిళా రైతు వాణి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం  నింపింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: