ఆంధ్రప్రదేశ్‌లో ఏక్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.. అదేంటి.. ఇంకా ఎన్నికలకు ఏడాదిపైగానే సమయం ఉంది కదా అనుకుంటున్నారా.. అది నిజమే కానీ.. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సాక్షాత్తూ ప్రభుత్వంలోని మంత్రే చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని.. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని మంత్రి అప్పల రాజు కార్యకర్తలకు చెబుతున్నారు.


అందుకే  సీఎం జగన్ ని శాశ్వత ముఖ్యమంత్రిగా చూసేందుకు కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని మంత్రి అప్పల రాజు సూచించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు నూతన క్యాంపు కార్యాల యాన్ని ప్రారంభించారు. దీన్ని జిల్లా వైసీపీ అధ్యక్షుడు  ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు ప్రతిపక్షాలు, మీడియా పై వ్యాఖ్యలు చేశారు. నా వెంట్రుక కూడా పీకలే రు అని మంత్రి అప్పలరాజు అన్నారు. ఇదే సమయంలో ఎన్నికలపై ఆయన కామెంట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: