నేతన్నల పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నేతన్నల పరిస్థితులపై లేఖ రాసిన కేటీఆర్.. నేతన్నలవి ఆత్మహత్యలు కాదు... అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అంటున్నారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా... ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మ బలిదానం చేసుకున్నారని మంత్రి కేటీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.పది ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనన్న మంత్రి కేటీఆర్‌ .. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా అంటూ మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు, సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం వచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లు ఆపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో నేతన్నలకు అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని మంత్రి కేటీఆర్‌ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: